×
Ad

Vijay: సంగీత, త్రిష ఇష్యూ.. ఎట్టకేలకు నోరు విప్పిన విజయ్.. అన్నీ తానే చూసుకుంటాడట

తనచుట్టూ జరుగుతున్న తాజా పరిణామాలపై ఎట్టకేలకు నోరు విప్పిన విజయ్(Vijay).

Vijay thalapathy interesting comments on the latest controversy

  • తాజా పరిణామాలపై స్పందించిన విజయ్
  • అవి నా వ్యక్తిగత విషయాలు మీరు బాధపడకండి
  • మనం ప్రజా సమస్యలపై పోరాడదాం అన్న విజయ్

Vijay: టీవీకే పార్టీ అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి ఎట్టకేలకు నోరు విప్పాడు. ఇటీవల ఆయనపై వస్తున్న వార్తలకు ఆయన సమాధానం చెప్పాడు. విజయ్ నుంచి ఆయన సతీమని సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. పెళ్ళైన 26 ఏళ్ళ తరువాత ఆమె విజయ్ నుంచి విడాకులు కోరడం అనేది సంచలనంగా మారింది. అంతేకాదు, అందుకు ఆమె చెప్పిన కారణం కూడా కొత్త అనుమానాలను రేకెత్తించింది.

విజయ్ కొన్నేళ్లుగా వేరే హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు, అందుకే, ఆయన నుంచి నాకు విడాకులు కావాలంటూ ఆమె పిటీషన్ లో పేర్కొంది. దాంతో ఆ హీరోయిన్ ఎవరు అంటూ సెర్చింగ్ మొదలయ్యింది. ఇదిలా ఉంటే, గత కొన్ని నెలలుగా విజయ్- త్రిష ల మధ్య ఎదో నడుస్తుంది అని, త్వరలో వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

Ustaad Bhagat Singh Teaser: ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు.. దుమ్ములేపిన ట్రైలర్ టీజర్

దాంతో, సంగీత చెప్పిన స్టార్ హీరోయిన్ త్రిషనే అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పెళ్లికి జంటగా వచ్చారు విజయ్- త్రిష. దాంతో, ఇద్దరిపై వస్తున్న వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే, ఎట్టకేలకు తాజాగా జరుగుతున్న పరిణామాలపై నోరువిప్పాడు విజయ్(Vijay).. ‘ఈమద్య చాలా వివాదాలు వస్తున్నాయి. ఆ విషయంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు.

మీరు కూడా ఆ వార్తల వల్ల బాధపడుతున్నారని తెలుసు. మీరు బాధపడటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అవి నా వ్యక్తిగత సమస్యలు. వాటి గురించి నేను చూసుకుంటాను. మీరు వాటిగురించి పట్టించుకోవద్దు. ఇప్పుడు మనమందరం కలిసి ప్రజా సమస్యలపై దృష్టి పెడదాం”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.