Vijay Trisha : మోహన్ బాబుని కలిసిన విజయ్, త్రిష.. ఒకే పెళ్ళిలో సందడి..
తాజాగా విజయ్ - త్రిష జంట మరోసారి ఓ పెళ్ళికి కలిసి వచ్చారు. (Vijay Trisha)
- Saketh U
- Published on- November 7, 2026 / 06:34 PM IST
Vijay Trisha
Vijay Trisha : గత కొన్నాళ్లుగా విజయ్ – త్రిష జంట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరి బంధంపై ఎన్ని కామెంట్స్ వచ్చినా స్పందించట్లేదు కానీ కలిసే తిరుగుతున్నారు. తమిళనాడు ఎన్నికల ముందు నుంచి విజయ్ – త్రిష కలిసి కనిపిస్తూ వైరల్ అవుతున్నారు. తాజాగా విజయ్ – త్రిష జంట మరోసారి ఓ పెళ్ళికి కలిసి వచ్చారు.
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో వైఎస్ అనీల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వివాహానికి అనేకమంది రాజకీయ, వ్యాపార సెలబ్రిటీలు హాజరయ్యారు. వైఎస్ జగన్, కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ త్రిషతో కలిసి వచ్చారు. ఇప్పటికే విజయ్, జగన్, కేటీఆర్ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవ్వగా తాజాగా మరిన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Kavya Kalyan Ram – Kaala Bhairava : పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్ – సంగీత దర్శకుడు.. ఫోటోలు వైరల్..
ఈ పెళ్ళికి మోహన్ బాబు, మంచు విష్ణు కూడా హాజరయ్యారు. విజయ్ మొదట మోహన్ బాబు, మంచు విష్ణు ని కలిసి మాట్లాడారు. ఆ వెనకే త్రిష కూడా వచ్చి మోహన్ బాబుని, మంచి విష్ణుని పలకరించింది. మోహన్ బాబు విజయ్ – త్రిషలతో మాట్లాడిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ పెళ్ళికి విజయ్ – త్రిష కలిసి వచ్చినా పెళ్ళిలో మాత్రం విడి విడిగానే తిరిగారు. ఇలా విడి విడిగానే సెలబ్రిటీలను కలిశారు.
