‘మాస్టర్’ ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

  • Publish Date - November 28, 2020 / 07:42 PM IST

Vijay’s Master Theatrical Release: ‘దళపతి’ విజయ్ హీరోగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘మాస్టర్’.. మాళవికా మోహనన్ కథానాయిక.

ఇటీవల కార్తి ‘ఖైది’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో XB Film Creators నిర్మిస్తోంది.


దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఇప్పటివరకు 40 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ‘మాస్టర్’ ఓటీటీలో విడుదల కానుంది అంటూ గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ఆ వార్తలను ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.


‘మా సినిమా ఓటీటీలో రిలీజవబోతోందనే వార్తలు అవాస్తవం. ‘మాస్టర్’ చిత్రాన్ని ఫ్యాన్స్, ఆడియెన్స్ థియేటర్లో ఎంజాయ్ చేస్తుంటే చూడాలని ఎదురు చూస్తున్నాం. రూమర్లు నమ్మకండి..

తమిళనాడు థియేటర్ల ఓనర్స్‌ మా సినిమాకు, తమిళ చిత్ర పరిశ్రమకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. త్వరలో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తాం’ అని పేర్కొన్నారు.