Movie Release: చిరుతో విక్రమ్ బాక్సాఫీస్ వార్.. తోడుగా అఖిల్, సామ్!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఆచార్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హిట్టుతో రివెంజ్ తీర్చుకోవాలని ఆరాటపడుతున్నారు.
- Naresh Mannam
- Published On : May 22, 2022 / 03:33 PM IST
Movie Release
Movie Release: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఆచార్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హిట్టుతో రివెంజ్ తీర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసమే ఆలస్యం చేయకుండా గాడ్ ఫాదర్ మూవీతో తిరిగి రావాలని చిరు కోరుకుంటున్నాడు. ఆగస్ట్ 15.. హాలీడే వీకెండ్ టార్గెట్ చేసుకొని గాడ్ ఫాదర్ గా థియేటర్లలో దిగిపోవాలని చూస్తున్నాడు. అధికారికంగా గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా మేకర్స్ అందుకోసమే ప్లాన్ చేస్తున్నారు.
Movie Releases: షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదే!
అయితే.. చిరుతో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ యుద్ధం ప్రకటించేలా కనిపిస్తున్నాడు. అదే ఆగస్టు నెలలో గాడ్ ఫాదర్ కంటే ముందే.. సెకండ్ వీక్‌పై ఖర్చీఫ్ వేశాడు విక్రమ్. ఆయన హీరోగా తెరకెక్కిన ‘కోబ్రా’ చిత్రం ఆగస్ట్ 11న సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద చిరు, విక్రమ్‌ల మధ్య యుద్దం తప్పనిసరి అవుతుందని భావిస్తున్నారు. చిరు-విక్రమ్ మధ్యే కాదు మధ్యలో మరికొందరు కూడా అదే వారాన్ని టార్గెట్ చేసి సినిమాల రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Movie Releases: మహేష్ లాస్ట్.. ఇక సందడంతా చిన్న హీరోలదే!
ఆగష్టు రెండో వారంలోనే చిరు, విక్రమ్ లతో పాటు యంగ్ హీరోలు అక్కినేని అఖిల్, నితిన్, స్టార్ హీరోయిన్ సమంత, కూడా వచ్చేస్తున్నారు. అఖిల్ ఏజెంట్, సామ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ యశోద, నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’కూడా అదే వారం బరిలో నిలవబోతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే పడింది. అయితే.. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇవ్వలేదు కాబట్టి మెగాస్టార్ వెనక్కు తగ్గుతాడా? లేక తమిళ హీరోతో పాటు మన యంగ్ హీరోలతో పోటీకి దిగుతాడా అన్నది చూడాల్సి ఉంది.
