×
Ad

Vikramarkudu 2 : ‘విక్రమార్కుడు 2’ వస్తుందా..?

రవితేజ - రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమార్కుడు’ మూవీకి సీక్వెల్ రాబోతుందా..?

  • Published On : September 28, 2021 / 05:15 PM IST

Vikramarkudu

Vikramarkudu 2: టాలీవుడ్ వర్గాల్లో ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో సూపర్ డూపర్ హిట్ సినిమా ‘విక్రమార్కుడు’. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ రాథోడ్ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనుష్క కథానాయిక.

Bellamkonda Sreenivas : బెల్లం బాబు.. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్.. ‘సుఖీభవ.. సుఖీభవ’..

ఇప్పుడు ‘విక్రమార్కుడు 2’ రానుందని సమాచారం. రవితేజ, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. ఇటీవల ‘సీటీమార్’ మూవీతో సక్సెస్ కొట్టిన యంగ్ డైరెక్టర్ సంసత్ నంది డైరెక్టె చెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు రవితేజ – సంపత్ నంది కలయికలో ‘బెంగాల్ టైగర్’ సినిమా వచ్చింది.

MAA Elections 2021 : పవన్ కళ్యాణ్ కామెంట్స్‌తో నేను ఏకీభవించట్లేదు..

అయితే ఈ సినిమా ‘విక్రమార్కుడి’ కి సీక్వెల్ ఆ లేక ప్రీక్వెల్ ఆ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సంపత్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా సంపత్‌కి సినిమా అవకాశమిచ్చారని వార్తలు వస్తున్నాయి.

Sahid Kapoor : సమంతకు షాహిద్ ఫిదా..