Makutam Teaser : విశాల్ ‘మకుటం’ టీజర్ వచ్చేసింది.. మూడు వేరియేషన్స్‌తో అదరగొట్టాడుగా..

మీరు కూడా మకుటం టీజర్ చూసేయండి.. (Makutam Teaser)

  • Updated on- June 11, 2026 / 07:22 PM IST

Makutam Teaser

Makutam Teaser : ఇటీవల వరుస సినిమాలతో సక్సెస్ సాధిస్తున్నాడు విశాల్. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్న సినిమా మకుటం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. అంజలి, దుషార విజయన్, తంబి రామయ్య, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా మకుటం టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. రెండు కాలాల్లో సాగుతుంది. అలాగే విశాల్ రెండు పాత్రల్లో మూడు వేరియేషన్స్ తో కనిపించబోతున్నాడు. ముసలి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. మాస్, యాక్షన్, రక్తపాతం ఉండబోతుందని తెలుస్తుంది. అంజలి ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతుంది.

Also Read : Isakapatnam : ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ కొత్త సిరీస్‌.. ఇసాక‌ప‌ట్నం ఎప్పుడో తెలుసా?

మీరు కూడా మకుటం టీజర్ చూసేయండి..