×
Ad

Vishal : విజయ్ కోసం 1500 మందితో ధర్నా చేస్తానంటున్న విశాల్.. ఎందుకో తెలుసా?

నటుడు విశాల్ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. (Vishal)

  • Published On : February 23, 2026 / 03:40 PM IST

Vishal

Vishal : తమిళ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో తన సొంత పార్టీతో పోటీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సినిమాలు చేయనని ప్రకటించాడు. తన చివరి సినిమా జన నాయగన్ ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందులతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.(Vishal)

సెంట్రల్ సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చినా స్టేట్ సెన్సార్ బోర్డు మాత్రం ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. తమిళనాడు స్టేట్ పాలిటిక్స్ పై, అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఈ సినిమాలో ఉన్నాయని అందుకే సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదని సమాచారం. కావాలని విజయ్ ని అడ్డుకుంటున్నారని, ఇదంతా రాజకీయ కుట్ర అని పలువురు విజయ్ మద్దతుదారులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : Killr Teaser : జ్యోతి పూర్వజ్ కిల్లర్ టీజర్ చూశారా..? మాములుగా లేదుగా..

ఈ క్రమంలో నటుడు విశాల్ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాల్ మాట్లాడుతూ.. అసలు ఒక అయిదుగురు కూర్చొని తమిళనాడులోని 7 కోట్లమంది సినిమా చూడాలా వద్దా అని సెన్సార్ బోర్డు ద్వారా ఎలా డిసైడ్ చేస్తారు. ఇదే కనక కంటిన్యూ అయితే జన నాయగన్ కోసం నడిగర్ సంఘంలోని 1500 మందితో కలిసి సెన్సార్ బోర్డుకి వ్యతిరేకంగా ధర్నా చేస్తాము అని ప్రకటించాడు.

విశాల్ విజయ్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు విజయ్ జననయగాన్ సినిమా కోసం విశాల్ ధర్నా చేస్తాను అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎవరైనా సినీ ప్రముఖులు, సెన్సార్ వాళ్ళు స్పందిస్తారేమో చూడాలి.

Also Read : Mega Brothers : అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు.. ఫోటోలు వైరల్