Vishal TVK: విజయ్ పార్టీలో చేరనున్న విశాల్.. గతంలో చెప్పినట్టే.. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?

Vishal TVK Party: విశాల్ రాజకీయాల్లోకి వస్తాను అని గతంలోనే ప్రకటించారు. (Vishal)

Vishal Will Join Vijay Tvk Party After Vijay Became Cm Of Tamilnadu

Vishal TVK: తమిళ్ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. విశాల్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతాయి. విశాల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. విశాల్ ఎక్కువగా సమాజంలో, సినీ పరిశ్రమలో జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తూ ఉంటారు. విశాల్ రాజకీయాల్లోకి వస్తాను అని గతంలోనే ప్రకటించారు.

విశాల్ గతంలోనే ఓ సారి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్నారు కానీ వేసిన నామినేషన్ రిజెక్ట్ అవ్వడంతో సైలెంట్ అయిపోయాడు. విజయ్ పార్టీ పెట్టిన తర్వాత విజయ్ ని కలిసి అభినందనలు తెలిపాడు. దాంతో విశాల్ విజయ్ పార్టీలో చేరి పోటీ చేస్తాడు అని వార్తలు వచ్చాయి.

Also Read : Vijay – Pawan Kalyan : విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ చేస్తారా?

విజయ్ ని కలిసిన తర్వాత అప్పట్లో విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేస్తాను. నా సత్తా ఏంటో చూపిస్తాను. తమిళనాడు ప్రజలకు సరైన సౌకర్యాలు లేవు, ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికే రాజకీయాల్లోకి వస్తాను అని తెలిపాడు.

ఇప్పుడు తమిళనాడులో విజయ్ సీఎం కాబోతుండటంతో విశాల్ విజయ్ పార్టీలో చేరతారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ మొదలైంది. ఆల్రెడీ విజయ్ ని అభినందిస్తూ విశాల్ ట్వీట్ కూడా చేసాడు. దీంతో విశాల్ రాజకీయ రాక పక్కా అని తెలుస్తుంది. మరి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసాక విశాల్ అధికారికంగా పార్టీలో చేరుతారా అనేది వేచి చూడాలి. భవిష్యత్తులో విజయ్ పార్టీ నుంచి విశాల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also Read : Jana Nayagan : కాబోయే సీఎం విజయ్.. ఇక భారీగా ‘జన నాయగన్’ రిలీజ్.. ఫ్యాన్స్ కి పండగే.. రిలీజ్ ఎప్పుడంటే?