Vijay – Pawan Kalyan : విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ చేస్తారా?
అయితే విజయ్ సీఎం అయ్యాక సినిమాలు చేస్తారా లేదా అనే చర్చ అభిమానుల్లో, తమిళ సినీ పరిశ్రమలో మొదలయింది. (Vijay - Pawan Kalyan)
Vijay Pawan Kalyan
Vijay – Pawan Kalyan : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల TVK పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. నేడు వెల్లడవుతున్న ఫలితాల్లో అనూహ్యంగా విజయ్ అధికారం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే విజయ్ 105 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి ఆధిక్యం వచ్చినా, హంగ్ వచ్చినా తమిళనాడు సీఎం మాత్రం విజయ్ అని విశ్లేషిస్తున్నారు.
అయితే విజయ్ సీఎం అయ్యాక సినిమాలు చేస్తారా లేదా అనే చర్చ అభిమానుల్లో, తమిళ సినీ పరిశ్రమలో మొదలయింది. విజయ్ గతంలో జన నాయగన్ సినిమా ఈవెంట్లో అదే తన చివరి సినిమా అని ప్రకటించాడు. ఇకపై రాజకీయాల్లోనే ఉంటాను అని, ప్రజలకు సేవ చేస్తాను అని ప్రకటించాడు. జన నాయగన్ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరి ఆ సినిమా రిలీజ్ తర్వాత విజయ్ సినిమాలు చేస్తారా? లేక చెప్పినట్టు అదే లాస్ట్ సినిమా అవుతుందా అనే చర్చలు మొదలయ్యాయి.
Also Read : Jana Nayagan : కాబోయే సీఎం విజయ్.. ఇక భారీగా ‘జన నాయగన్’ రిలీజ్.. ఫ్యాన్స్ కి పండగే.. రిలీజ్ ఎప్పుడంటే?
పవన్ కళ్యాణ్ కూడా గతంలో పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పుడు అజ్ఞాతవాసి సినిమానే తన చివరి సినిమా అని ప్రకటించారు. కానీ పవన్ కి సినిమాలు తప్ప ఇంకో ఆదాయం లేకపోవడంతో పార్టీని నడిపించడం కోసం, ఫ్యామిలీ కోసం పవన్ సినిమాలు చేయక తప్పలేదు. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా ప్రభుత్వ పనులతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు.
అయితే విజయ్ కి కూడా సినిమాలు తప్ప మరో ఆదాయం లేదు. కానీ విజయ్ సంపాదించిన డబ్బులు గతంలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాడు. దీంతో విజయ్ కి చెన్నై లో, తమిళనాడులోని పలు ప్రదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. అలాగే విజయ్ కి ఆల్రెడీ 200 కోట్ల వరకు సేవింగ్స్ ఉన్నట్టు తన ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నాడని తమిళ మీడియా సమాచారం. అలాగే విజయ్ కి ఓ ట్రస్ట్ కూడా ఉంది. సినిమాలు చేయకపోయినా విజయ్ ఆర్థికంగా కొంతకాలం వరకు స్ట్రాంగ్ గానే ఉంటారు అని సమాచారం. మరి భవిష్యత్తులో పవన్ లాగా ఆదాయం కోసం సినిమాలు చేస్తారా? లేక సీఎం అయ్యాక సినిమాలు పూర్తిగా వదిలేస్తారా తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also See : Vijay Trisha : సీఎం కాబోతున్న విజయ్.. ట్రెండింగ్ లో త్రిష.. విజయ్ – త్రిష ఫొటోలు వైరల్..
