Vishwak Sen : మూడు నెలల్లో మూడు సినిమాలతో రాబోతున్న విశ్వక్.. వరుస ఫ్లాప్స్ కి చెక్ పెడతాడా?
వరుస పెట్టి ఫ్లాప్స్ చుసిన విశ్వక్ సేన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలతో రాబోతున్నాడు. (Vishwak Sen)
- Saketh U
- Updated on- September 20, 2026 / 04:52 PM IST
Vishwak Sen
Vishwak Sen : మొదట్లో మంచి విజయాలే సాధించి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లోనే ఉన్నాడు. విశ్వక్ లాస్ట్ హిట్ అంటే గామి అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా, ఫంకీ.. సినిమాలతో వచ్చాడు. ఈ నాలుగు సినిమాలు పరాజయమే చూశాయి. లైలా అయితే డిజాస్టర్. ఇలా వరుస పెట్టి ఫ్లాప్స్ చుసిన విశ్వక్ సేన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలతో రాబోతున్నాడు.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూనే తన సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సినిమా అక్టోబర్ 30న రిలీజ్ కాబోతుందని ఇటీవలే ప్రకటించాడు. విశ్వక్ డైరెక్షన్ లో గతంలో వచ్చిన ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ కల్ట్ కూడా హిట్ అవుతుందనే భావిస్తున్నారు.
Also See : Nayanthara : బీచ్ ఒడ్డున ‘నయనతార’.. మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలు వైరల్..
ఇక కల్ట్ తర్వాత ఈఎన్ఈ రిపీట్ (ఈ నగరానికి ఏమైంది 2) సినిమా నవంబర్ 19న రిలీజ్ కాబోతుంది. ఈ నగరానికి ఏమైంది సినిమాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు ఉన్న హైప్ తో ఇది కూడా హిట్ అవుతుందనే అనుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయినా ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తాయి.
కల్ట్, ఈఎన్ఈ రిపీట్ సినిమాల తర్వాత విశ్వక్ సేన్ హీరోగా చేసిన మరో సినిమా లెగసీ డిసెంబర్ 4న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటిదాకా అయితే పెద్దగా బజ్ లేదు. రిలీజ్ సమయానికి ఏమైనా ఈ సినిమాపై హైప్ వస్తుందేమో చూడాలి. మొత్తానికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో కల్ట్, ఫలక్ నామా దాస్, లెగసీ.. మూడు సినిమాలతో వరుసగా రాబోతున్నాడు విశ్వక్. ఈసారైనా హిట్స్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
