Vishwak Sen gives costly Rolex gold watch to music director Ravi Basrur
Cult: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్ట్(Cult). మోస్ట్ వైలెంట్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు స్వయంగా విశ్వక్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఆయన డైరెక్షన్ లో ఇది మూడవ సినిమా. ఇప్పటికే విశ్వక్ ఫలక్నుమా దాస్, దాస్ కా ధమ్కీ అనే సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇప్పుడు చాలా కాలం తరువాత మళ్ళీ ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో కల్ట్ పై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక తాజాగా కల్ట్ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. వైలెంట్ కంటెంట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ టీజర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే సినిమాపై అంచనాలను కూడా ఒక రేంజ్ లో పెంచేసింది. ఈ ఈవెంట్ లో విశ్వక్ మాట్లాడుతూ.. దాదాపు నాలుగేళ్లుగా ఈ కథను రాస్తున్నాను, ఫైనల్ ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది.
Allu Arjun: మెగాస్టార్ ని బీట్ చేసిన అల్లు అర్జున్.. అది కూడా అతి తక్కువ టైంలో
ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించాడు. ఈ సినిమాకు ఆయన ఒక కన్ను అయితే మరో కన్ను రవి బాసృర్ గారు. ఆయన ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. అయన మ్యూజిక్ తరువాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. ఇంతమంచి మ్యూజిక్ నా సినిమాకు పడుతుంది అనుకోలేదు. అందుకు ఆయనకు కృతజ్ఞతగా రోలెక్స్ గోల్డ్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇది నా ఫేవరెట్ వాచ్. రెండేళ్లు వెయిట్ చేసి మరీ తెప్పించుకున్నాను. మళ్లీ నేనెప్పుడైనా సినిమా చేయమని అడిగితే ఈ వాచ్ చూసైనా ఓకే చేయాలి సార్ మీరు. అంటూ చెప్పుకొచ్చారు విశ్వక్.
అనంతరం ఆ వాచ్ ను మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ చేతికి తొడిగి అందరికీ చూపించాడు. ఇక ఆ వాచ్ ఖరీదు ముప్పై లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలను ఆయన మ్యూజిక్ అందించాడు. త్వరలో రాబోతున్న మోస్ట్ హైపుడ్ మూవీ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నాడు.