Vishwak Sen : రామ్‌చరణ్‌ని ఎందుకు కలిశాను.. అనేది అడగకండి.. విశ్వక్ రహస్యం ఏంటి..?
రామ్‌చరణ్‌ని ఎందుకు కలిశాను అనేది తనని అడగకండి అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొస్తున్నారు. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి..?
- gum 95921
- Published On : February 15, 2024 / 09:04 PM IST
Vishwak Sen interesting comments about meeting with Ram Charan
Vishwak Sen : టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాలతో ఓన్ ఫ్యాన్‌డమ్ ని సంపాదించుకుంటూనే.. ఇండస్ట్రీలోని స్టార్ ఫ్యామిలీస్ అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ని బాగా దగ్గర చేసుకున్నారు. బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్‌స్టాపబుల్ కి గెస్ట్ గా వెళ్లిన విశ్వక్.. ఆ షోలో బాలయ్యకి బాగా దగ్గరయ్యారు.ఇక ఆ తరువాత నుంచి బాలయ్యని రెగ్యులర్ గా కలవడం, పార్టీలు చేసుకోవడం వంటి చేస్తూ వస్తున్నారు.
ఇక నందమూరి కుటుంబంలో బాలయ్యతో స్నేహం పెంచుకున్న విశ్వక్.. ఇటు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ తో ఫ్రెండ్‌షిప్ ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్లిన రామ్ చరణ్.. ఈ మధ్య కూడా విశ్వక్ ని పర్సనల్ గా కలుసుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ నుంచి కూడా విశ్వక్ కి సపోర్ట్ రావడం మొదలయింది. అయితే విశ్వక్ అసలు రామ్ చరణ్ ని ఎందుకు కలిశారు..? అనేది చాలామందిలో ప్రశ్నగా మారింది.
Also read : Vishwak Sen : విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి.. నాగచైతన్య హీరోగా సెలెక్ట్.. ఏ మూవీ..?
ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో విశ్వక్ ని ప్రశ్నించారు. ‘రామ్ చరణ్ ని కూడా రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు. ఆయనతో ఏం చర్చలు చేస్తున్నారు..?’ అని ప్రశ్నించగా, విశ్వక్ బదులిస్తూ.. “ఏం మాట్లాడుకున్నారు అని ఏ యాక్టర్ ని అడగకండి. ఎవరు నిజం చెప్పారు” అంటూ బదులిచ్చారు. ఈ సమాధానంతో చరణ్, విశ్వక్ మీటింగ్ పై మరింత ఆసక్తి కలుగుతుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే నిఖిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే విశ్వక్ తో కూడా ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా..? అనే సందేహం కలుగుతుంది. కాగా ప్రస్తుతం విశ్వక్ చేతిలో అరడజనకు సినిమాలు వరకు ఉన్నాయి. వీటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి విడుదలకు సిద్ధమవుతున్నాయి.
