×
Ad

Funky : విశ్వక్ సేన్ ఫంకీ సినిమా.. ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడంటే?

ఫంకీ సినిమా నేడు ఫిబ్రవరి 13న థియేటర్స్ లో రిలీజయింది.(Funky)

  • Published On : February 13, 2026 / 02:06 PM IST

Funky

Funky : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కయదు లోహర్ జంటగా తెరకెక్కిన సినిమా ఫంకీ. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా తెరకెక్కింది. ఫంకీ సినిమా నేడు ఫిబ్రవరి 13న థియేటర్స్ లో రిలీజయింది.(Funky)

సినిమా బ్యాక్ డ్రాప్ లో ఓ కొత్త డైరెక్టర్, నిర్మాత కూతురు ప్రేమ కథతో, సినీ పరిశ్రమలో జరిగే సంఘటనలతో కామెడీ కథాంశంతో ఫంకీ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో వస్తుందని సినిమాతో పాటే తెరపై ప్రకటించారు. ఇటీవల సూపర్ హిట్ సినిమాలు కూడా నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తున్నాయి.

Also Read : Funky Review : ‘ఫంకీ’ మూవీ రివ్యూ.. జాతి రత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్ సినిమా.. నవ్వించారా..?

ఈ లెక్కన ఫంకీ సినిమా మార్చ్ 11 లేదా 12 , మార్చ్ రెండో వారంలోనే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తుందని తెలుస్తుంది.