Vishwak Sen : అందంగా ఉంటే సరిపోదు యాక్టింగ్ చేయాలి.. హీరోయిన్స్ పై విశ్వక్ సంచలన వ్యాఖ్యలు..
విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Vishwak Sen)
- Saketh U
- Published On : February 10, 2026 / 03:15 PM IST
Vishwak Sen
Vishwak Sen : విశ్వక్ సేన్ ఇప్పుడు ఫంకీ సినిమాతో రాబోతున్నాడు. అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్, కయదు లోహర్ జంటగా తెరకెక్కిన ఫంకీ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Vishwak Sen)
Also Read : Shamna Kasim : సెకండ్ ప్రగ్నెన్సీ.. భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మన దగ్గర చాలా తక్కువమంది పర్ఫార్మర్స్ ఉన్నారు. హీరోయిన్స్ ఉన్నారు కానీ పర్ఫార్మర్స్ తక్కువ మంది ఉన్నారు. అందంగా ఉంటే సరిపోదు యాక్టింగ్ చేయాలి. ప్రతి సినిమాకు, ప్రతి హీరోకు ఇప్పుడు హీరోయిన్ ని వెతకడం చాలా కష్టమైన పని. మంచి హీరోయిన్స్ ఉన్నా వాళ్ళు బిజీగా ఉండటంతో కొన్ని సినిమాకు, ఆ పాత్రకు తగ్గ హీరోయిన్ దొరకట్లేదు. నాతో పనిచేసిన వాళ్ళల్లో నివేతా పేతురాజ్, మిథిలా పాల్కర్ మంచి పర్ఫార్మర్స్ అని తెలిపాడు. దీంతో విశ్వక్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
