Gaami : సినిమాలో మాస్ డైలాగ్స్, ఐటమ్ సాంగ్స్, ఫైట్స్ ఏమీ ఉండవు.. విశ్వక్ సేన్

గామి సినిమాలో మాస్ డైలాగ్స్, ఐటమ్ సాంగ్స్, ఫైట్స్ ఏమీ ఉండవు అంటున్న విశ్వక్ సేన్. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం..

Vishwak Sen viral comments about Gaami movie gone viral

Gaami : మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్.. తన జోనర్ దాటి వెళ్తూ ‘గామి’ అనే సరికొత్త కథని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ అఘోరగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు ఆరేళ్లు పాటు విశ్వక్ అండ్ మూవీ టీం కష్టపడింది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో ఈ సినిమాలోని చాలా సీన్స్ ని తెరకెక్కించారు. ఇటీవల టీజర్ అండ్ మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యేవరకు.. ఈ మూవీ పై ఎటువంటి అంచనాలు లేవు.

కానీ అవి రిలీజైన తరువాత ఆడియన్స్ లో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక తాజాగా వచ్చిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ట్రైలర్ ఎండ్ లో సింహం యాక్షన్ షాట్ ని చూపించి ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించారు. ట్రైలర్ లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి.. ఒక కొత్త యాక్షన్ అడ్వెంచర్ మూవీని చూడబోతున్నాము అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు.

Also read : Kangana Ranaut : పాలిటిక్స్‌లోకి రావడానికి ఇదే సరైన సమయం అంటున్న కంగనా..

అయితే ఆడియన్స్ అనుకున్నట్లు ఈ సినిమాలో విజుల్స్ వేయించే ఫైట్ సీన్స్ ఏమీ ఉండవని విశ్వక్ సేన్ చెబుతున్నారు. “మూవీలో మాస్ డైలాగ్స్, ఐటమ్ సాంగ్స్, విజుల్స్ వేయించే ఫైట్ సీన్స్ ఉండవు. కానీ సెకండ్ హాఫ్ లో వీటిని అన్నిటిని సంతృప్తి పరిచే సీన్స్ ఉంటాయి. ఆ సెకండ్ హాఫ్ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని మాత్రం నేను గట్టిగా చెప్పుకొస్తాను” అంటూ విశ్వక్ పేర్కొన్నారు.

విశ్వక్ మాట్లాడిన మాటలు.. సినిమాలో ఏదో కొత్తదనం ఉందనే విషయాన్ని మాత్రం గట్టిగా తెలియజేస్తుంది. కాగా ఈ సినిమాలో పాత్రల్లో విశ్వక్ తో పాటు చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విద్యాధర్ కాగిత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మార్చి 8న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు