Kangana Ranaut : పాలిటిక్స్‌లోకి రావడానికి ఇదే సరైన సమయం అంటున్న కంగనా..
పాలిటిక్స్‌లోకి రావడానికి ఇదే సరైన సమయం అంటున్న కంగనా. దేశం తనకి చాలా ఇచ్చిందని, దాని తిరిగి ఇవ్వడం..

Bollywood Actress Kangana Ranaut interesting comments about her political entry
Kangana Ranaut : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ పై గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ వస్తూనే ఉన్నాయి. సినిమా రంగంలోని సమస్యలతో పాటు సమాజంలోని ప్రజా సమస్యల పై కూడా మాట్లాడుతూ పొలిటికల్ లీడర్స్ ని విమర్శలు చేస్తూ.. ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ని అందుకున్నారు. ఇక ఇవన్నీ చూసిన ఆడియన్స్.. కంగనా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని అంచనాలు వేస్తూ ఉంటారు.
ఇక ఈ పొలిటికల్ ఎంట్రీ గురించి కంగనాని ప్రశ్నిస్తే.. “శ్రీకృష్ణుడు ఆశీర్వాదం ఇస్తే, నేను పోరాడతాను” అంటూ సమాధానమే ఇస్తూ వస్తున్నారు. దీంతో కంగనా పొలిటిల్ ఎంట్రీ పై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా కంగనా తన రాజకీయ రంగప్రవేశం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. “రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం” అంటూ పేర్కొన్నారు.
Also read : Gaami Trailer : విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్..
అసలు కంగనా ఏమందంటే.. “ఈ దేశం నాకు చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వడం అనేది నేను నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ జాతీయవాదిగా ఉంటాను. ఈ భావనే నా అద్భుతమైన నటనా వృత్తిని కూడా డామినేట్ చేసింది. అందువలనే నేను సినిమా సెట్స్ నుండే రాజకీయ పార్టీలతో పోరాడాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి కంగనా తన పొలిటికల్ ఎంట్రీని ఎలా ఇవ్వబోతున్నారో చూడాలి. ప్రస్తుతం ఈమె ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లైఫ్ లోని ఒక అంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని కంగనానే డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇందిరా గాంధీ పాత్రలో ఆమె నటిస్తున్నారు. జూన్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.