Gaami Trailer : విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్..

విశ్వక్ సేన్ అఘోరగా నటిస్తున్న 'గామి' మూవీ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

Gaami Trailer : విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్ వచ్చేసింది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్..

Vishwak Sen Chandini Chowdary Gaami Movie Trailer Released

Updated On : February 29, 2024 / 8:21 PM IST

Gaami Trailer : విశ్వక్ సేన్ అఘోరగా నటిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘గామి’. దాదాపు ఆరేళ్లు పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజైన పోస్టర్స్, టీజర్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. టాలీవుడ్ నుంచి మరో సూపర్ హిట్ మూవీ రాబోతుందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.

ఇక మార్చి 8కి రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో మొత్తం ముగ్గురి కథలు చూపించారు. ఒక పాత్ర ఊరిలో దేవదాసిగా ఉన్న మహిళ, మరో పాత్ర పరిశోధనశాలలో బంధీగా ఉన్న ఓ కుర్రాడు, మూడో పాత్ర హీరో అఘోర. ఈ మూడు పాత్రల్లోని కథ చాలా ఇంటెన్స్ తో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ లోని విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ప్రతి సీన్ కనిపిస్తుంది. ఆ ట్రైలర్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

Also read : Sree Vishnu : శ్రీవిష్ణుకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఏంటో తెలుసా..!

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ తోనే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. మరి థియేటర్స్ లో ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.