Sree Vishnu : శ్రీవిష్ణుకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఏంటో తెలుసా..!

శ్రీవిష్ణుకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అరవింద్. ఆ గిఫ్ట్ ఏంటో శ్రీవిష్ణు సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసారు.

Sree Vishnu : శ్రీవిష్ణుకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఏంటో తెలుసా..!

Tollywood Star Producer Allu Aravind special gift for Sree Vishnu on his birthday

Sree Vishnu : టాలీవుడ్ యువ హీరో శ్రీవిష్ణు.. కంటెంట్ ఉన్న సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి మెప్పిస్తూ ఉంటారు. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూనే.. అప్పుడప్పుడు ఎక్స్‌పీర్మెంట్స్ కూడా చేస్తుంటారు. చివరిగా ఈ హీరో ‘సామజవరగమన’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో వచ్చి హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నారు. దీంతో నెక్స్ట్ మూవీస్ అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈక్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక నేడు ఫిబ్రవరి 29న విష్ణు పుట్టినరోజు కావడంతో.. ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని మేకర్స్ బహుమతిగా ఇస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఒక సూపర్ గిఫ్ట్ ని శ్రీవిష్ణుకి పంపించారు. ఆ గిఫ్ట్ ఏంటో శ్రీవిష్ణు అందరికి తెలియజేసారు.

Also read : Drishyam : భారతీయ తొలి చిత్రంగా.. హాలీవుడ్‌కి వెళ్తున్న దృశ్యం..

అల్లు అరవింద్ సమర్పణలో శ్రీవిష్ణు తన 18వ సినిమాని చేయబోతున్నారట. కళ్యా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇక ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ దర్శకుడు గతంలో ‘నిను వీడని నీడను నేనే’, ‘నేనే నా’.. వంటి థ్రిల్లర్ మూవీస్ చేశారు. తమిళంలో యాక్షన్ కామెడీ సినిమాలని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు శ్రీవిష్ణుతో ఓ రొమాంటిక్ కామెడీ డ్రామా తెరకెక్కించబోతున్నారని అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే అర్ధమవుతుంది.

ఈ క్రేజీ అనౌన్స్‌మెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయనున్నారు. కాగా ప్రస్తుతం శ్రీవిష్ణు ‘హుషారు’ మూవీ ఫేమ్ హర్ష కొనుగంటి డైరెక్షన్ లో ‘ఓం భీమ్ బుష్’ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీని తరువాత ‘రాజ రాజ చోర’ సినిమా దర్శకుడు హసిత్ గోలితో ‘స్వాగ్’ అనే కొత్త సినిమాని తీసుకు రాబోతున్నారు.