Chiranjeevi : ‘నా జీవన రేఖ’.. అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించో తెలుసా..!
'నా జీవన రేఖ' అంటూ ట్విట్టర్ లో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్. ఎవరి గురించో తెలుసా..!
- gum 95921
- Published on- February 18, 2024 / 10:40 AM IST
Vishwambhara star Chiranjeevi emotional post in social media gone viral
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి.. అభిమానులతో మరింత దగ్గరగా ఉంటున్నారు. ఆయనకి సంబంధించిన విషయాలతో పాటు మెగా హీరోల విషయాలు ఎన్నింటినో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ.. వారిని ఖుషీ చేస్తూ వస్తున్నారు. తాజాగా చిరంజీవి తన ఎక్స్ (X) అకౌంట్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏ విషయం గురించి పోస్ట్ వేశారు..?
చిరంజీవి సతీమణి సురేఖ గురించి ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేయనవసరం లేదు. ఈమె గురించి చిరంజీవి, రామ్ చరణ్ మాటల్లో కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ మాటల్లోనే విని ఉంటారు. సురేఖ తనకి రెండో అమ్మ అంటూ పవన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. కాగా నేడు ఫిబ్రవరి 18న ఈమె పుట్టినరోజు కావడంతో చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్ వేశారు.
Also read : Naga Chaitanya – Sai Pallavi : లవ్ స్టోరీలో సాయి పల్లవి, నాగచైతన్యకి నిజంగానే ముద్దు పెట్టిందా..!
నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ.. అంటూ కవిత్వం వర్ణిస్తూ బర్త్ డే విషెస్ తెలియజేసారు. “నా జీవిత భాగస్వామి, నా జీవితానికి గ్రేటెస్ట్ పిల్లర్ అయిన సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు తన సతీమణితో ఉన్న ఓ ఫోటోని కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్టు చూసిన మెగా అభిమానులు.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
కాగా చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ డ్రామాతో గ్రాఫికల్ వండర్ గా రూపొందబోతుంది. త్రిష ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి, త్రిష ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది.
