Vivek Chepuri : ‘కల్ట్’ లో విలన్ గా అందర్నీ భయపెట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఇప్పుడు హీరోగా ఎంట్రీ..
సినిమా ఫలితం ఎలా ఉన్నా వివేక్ నటనకు మాత్రం ఫుల్ మర్క్స్ పడుతున్నాయి. (Vivek Chepuri)
- Saketh U
- Published on- November 5, 2026 / 02:21 PM IST
Vivek Chepuri
Vivek Chepuri : ఇటీవల విశ్వక్ సేన్ కల్ట్ సినిమాలో విలన్ గా వివేక్ చేపూరి అనే నటుడు నటించాడు. నెగిటివ్ షేడ్స్ లో, మతిస్థిమితం లేని పేషేంట్ గా, గే పాత్రలో.. ఇలా డిఫరెంట్ షేడ్స్ చూపించి భయపెట్టి ఎమోషనల్ చేసాడు వివేక్ చేపూరి. కల్ట్ తో ఒక్కసారిగా వైరల్ అయిన ఈ నటుడు గతంలో ఫలక్ నామా దాస్ సినిమాలో రవి అనే పాత్రలో మెప్పించాడు.
2019లో వచ్చిన ఆ సినిమాలో విశ్వక్ సేన్‌కి ధీటుగా వివేక్ చేపూరి కనిపించాడు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ దర్శకత్వంలో కల్ట్ సినిమాలో తన మార్క్ క్రియేట్ చేశాడు. కల్ట్ సినిమాలో ఇషాన్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ చూపిస్తూ తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా వివేక్ నటనకు మాత్రం ఫుల్ మర్క్స్ పడుతున్నాయి.
Also Read : ENE Repeat : ‘ఈ నగరానికి ఏమైంది 2’లో రౌడీ హీరో గెస్ట్ అప్పీరెన్స్.. స్టార్ డైరెక్టర్ కూడా..?
ఈ నటుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వివేక్ హీరోగా టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళంలో ద్విభాష సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కల్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన వివేక్ ఇప్పుడు హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.
