×
Ad

Vishal : విశాల్ – తమన్నా కొత్త సినిమా అనౌన్స్.. గ్లింప్స్ భలే ఉందే.. మొగుడు మొగుడిలా ఉండాలి…

తాజాగా విశాల్ 36వ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఆసక్తికర గ్లింప్స్ రిలీజ్ చేసారు.(Vishal)

Tamannaah Bhatia

Vishal : తమిళ్ తో పాటలు తెలుగులో కూడా అదే రేంజ్ మార్కెట్ ఉన్న హీరోల్లో విశాల్ ఒకరు. విశాల్ ఇటీవల మార్క్ ఆంటోని, మదగజరాజ సినిమాలతో హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం విశాల్ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా విశాల్ 36వ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఆసక్తికర గ్లింప్స్ రిలీజ్ చేసారు.(Vishal)

విశాల్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా యోగిబాబు కీలక పాత్రలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుందర్ C దర్శకత్వంలో అరుణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో టైటిల్ ‘మొగుడు’ అంటూ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Also See : Krithi Shetty : బెడ్ రూమ్ లో కృతిశెట్టి హాట్ పోజులు.. ఫోటోలు వైరల్..

ఈ గ్లింప్స్ లో.. తమన్నా భర్తకు ఆర్డర్స్ వేసే భార్యగా, విశాల్ ఇంట్లో పనులు చేసే మొగుడుగా, సీక్రెట్ గా యాక్షన్స్ చేసే హీరోగా, మధ్యలో యోగిబాబు కామెడీ చేస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా కామెడీ యాక్షన్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మీరు కూడా విశాల్ కొత్త సినిమా మొగుడు గ్లింప్స్ చూసేయండి..

Also Read : Jabardasth Rajamouli : జబర్దస్త్ లో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు.. కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారు..