Jabardasth Rajamouli : జబర్దస్త్ లో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు.. కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారు..

జబర్దస్త్ రాజమౌళి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన జర్నీ గురించి తెలిపాడు.(Jabardasth Rajamouli)

Jabardasth Rajamouli : జబర్దస్త్ లో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు.. కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారు..

Jabardasth Rajamouli

Updated On : January 21, 2026 / 5:31 PM IST
  • జబర్దస్త్ రాజమౌళి ఇంటర్వ్యూ
  • జబర్దస్త్ గురించి కామెంట్స్
  • తన ఉద్యోగం గురించి వ్యాఖ్యలు

Jabardasth Rajamouli : ఎన్నో ఏళ్లుగా సినీ, టీవీ పరిశ్రమలో ఉన్న రాజమౌళి జబర్దస్త్ షోలో మందు తాగిన వ్యక్తిగా నటించి ఫేమ్ తెచ్చుకున్నాడు. మందు మీద పేరడీ సాంగ్స్ తో అందర్నీ నవ్వించి పాపులర్ అయ్యాడు. తాజాగా జబర్దస్త్ రాజమౌళి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన జర్నీ గురించి తెలిపాడు.(Jabardasth Rajamouli)

Also Read : Jabardasth Rajamouli : కరోనాతో చనిపోయేవాడ్ని.. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. రాజమౌళి ఎమోషనల్

జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ.. నేను 20 ఏళ్ళ క్రితమే వచ్చాను. కొన్ని సినిమాలు, సీరియల్స్, సాంగ్స్, ఆల్బమ్స్ చేశాను. నాకు మొదట జబర్దస్త్ కి అవకాశం వచ్చినప్పుడు ఒక వన్ ఇయర్ వరకు వెళ్ళలేదు. ఆ షో నాకు మొదట్లో నచ్చలేదు. ఆ తర్వాత జబర్దస్త్ షోకి బాగా రీచ్ అయ్యాక వెళ్తే బాగుండు అనిపించింది. దాంతో మరోసారి అవకాశం రాగానే వెళ్ళాను. అప్పుడు ఒక NGO లో జాబ్ చేస్తున్నాను. కాజీపేటలో నా డ్యూటీ చేసుకుంటూ షూటింగ్ ఉన్నపుడు సెలవు పెట్టుకొని హైదరాబాద్ కి వచ్చేవాడిని.

ఇక్కడ వీళ్లకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. జబర్దస్త్ లో నాకు మొదట 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు. వేణు అన్న మొదటిసారి పదివేలు చెక్ ఇచ్చారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. మాలాంటి తెలంగాణ కళాకారులకు తెలంగాణ సాంసృతిక శాఖలో కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఆ ఉద్యోగాలు ఇచ్చారు. నాకు కూడా ఉద్యోగం వచ్చింది. రసమయి బాలకిషన్ అప్పుడు చైర్మన్. అయితే కళాకారులు టీవీ, సినిమాల్లో చేయొద్దు అని మా అందరికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు చెప్పారు. అందుకే మధ్యలో జబర్దస్త్ కి దూరం అయ్యాను అని తెలిపారు.

Also Read : Sankranthiki Vasthunam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ లో నటించే హీరో, హీరోయిన్స్ వీళ్ళే.. అక్కడ హిట్ అవుతుందా..?

ఆ తర్వాత ఒక ఈవెంట్ కి జబర్దస్త్ వాళ్ళు వెంకీ, జీవన్, ఇంకొంతమంది వచ్చారు నా ఫ్రెండ్స్. అక్కడికి వచ్చిన జనాలు వాళ్ళతో ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ నాతో తీసుకోవట్లేదు. అప్పుడు బాధ వేసింది. దాంతో రసమయి గారిని కలిసి జాబ్ చేస్తూ జబర్దస్త్ చేసుకుంటా మేనేజ్ చేస్తా అని రిక్వెస్ట్ చేశా. ఓకే అనడంతో మళ్ళీ జబర్దస్త్ కి వచ్చాను అని తన జబర్దస్త్ ప్రస్థానం గురించి తెలిపాడు రాజమౌళి.