Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వచ్చేది ఆ రోజే.. డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, చాలా రోజుల తరువాత చిరంజీవి పక్కా ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు.
- Anil Aaleti
- Published On : December 7, 2022 / 05:10 PM IST
Waltair Veerayya Locks Its Release Date
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, చాలా రోజుల తరువాత చిరంజీవి పక్కా ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
Waltair Veerayya : ఫ్రాన్స్‌కి వెళ్లనున్న వాల్తేరు వీరయ్య..
ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించడంతో, రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, సంక్రాంతి బరిలో ఇప్పటికే రెండు సినిమాలు తమ రిలీజ్ డేట్‌ను కన్ఫం చేసుకున్నాయి. తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అటు మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా కూడా జనవరి 12న వచ్చేందుకు రెడీ అయ్యింది.
Waltair Veerayya: వీరయ్య సింగిల్‌గానే వచ్చి వాయిస్తాడా..?
దీంతో వాల్తేరు వీరయ్య ఎప్పుడు వస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ అండ్ టీమ్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో మిగతా రెండు సినిమాల కంటే ఒక్కరోజు ఆలస్యంగా వస్తున్న వాల్తేరు వీరయ్య ఖచ్చితంగా ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తాడని.. వారికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సంక్రాంతి కి కలుద్దాం ??@RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/dLBKLphlZk
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 7, 2022
