Waltair Veerayya: ఫ్యామిలీతో విహార యాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర.. అదిరిపోయిందిగా!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా కాలం తరువాత చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
- Anil Aaleti
- Published On : December 8, 2022 / 02:52 PM IST
Waltair Veerayya Off To Europe For Two Songs Shoot
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా కాలం తరువాత చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో చిరు పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఇప్పటికే చిత్ర పోస్టర్స్, టీజర్స్, సాంగ్ చూస్తే అర్థమవుతోంది.
Waltair Veerayya : మేస్త్రి టు వీరయ్య.. మాస్ జాతరకు 30 ఏళ్ళు..
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని.. మిగతా షూటింగ్ పూర్తయ్యిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ సాంగ్స్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరప్‌కు బయల్దేరింది. అయితే మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్‌కు బయల్దేరారు. అటు ఫ్యామిలీతో విహార యాత్రగాను.. ఇటు హీరోయిన్‌తో వీరయ్య యాత్ర అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వచ్చేది ఆ రోజే.. డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్!
ఒకేసారి ఇలా చిత్ర యూనిట్‌తో షూటింగ్ కోసమే కాకుండా.. ఫ్యామిలీని యూరప్ టూర్‌కు తీసుకెళ్లినట్లుగా కూడా ఉంటుందని ఆయన ఇలా ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.
ఫ్యామిలీ తో అటు విహార యాత్ర
హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర ? #EuropeBeckons #WaltairVeerayya pic.twitter.com/EnhJxSlFq4
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2022
