Waltair Veerayya : మేస్త్రి టు వీరయ్య.. మాస్ జాతరకు 30 ఏళ్ళు..

మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ రూపంలో దర్శనమిస్తూ తెరకెక్కుతున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. కాగా చిరంజీవిని చివరిగా ఇంత ఊర మాస్ గెటప్ లో చూసింది 'ముఠామేస్త్రి' సినిమాలోనే. 1993లో విడుదలైన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఒక మైలు రాయిగా మిగిలిపోయింది.

Waltair Veerayya : మేస్త్రి టు వీరయ్య.. మాస్ జాతరకు 30 ఏళ్ళు..

Mestri to Veerayya

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ రూపంలో దర్శనమిస్తూ తెరకెక్కుతున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ ఇమేజ్ తో పైకి వచ్చిన చిరు నుంచి ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వాల్తేరు వీరయ్యతో వింటేజ్ చిరుని పరిచయం చేయడంతో, చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. విడుదలైన టైటిల్ టీజర్ అండ్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వచ్చేది ఆ రోజే.. డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్!

కాగా చిరంజీవిని చివరిగా ఇంత ఊర మాస్ గెటప్ లో చూసింది ‘ముఠామేస్త్రి’ సినిమాలోనే. 1993లో విడుదలైన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఒక మైలు రాయిగా మిగిలిపోయింది. “దాదాపు 30 ఏళ్ళ తరువాత తన అభిమాన హీరోని మళ్ళీ ఆ మాస్ మూలవిరాట్ రూపంలో చూపించబోతున్నాను” అంటూ దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 30 ఏళ్ళ తరువాత మళ్ళీ అటువంటి మాస్ జాతర ఈ సంక్రాంతికి అభిమానులు చేసుకోబోతున్నారు అంటూ వెల్లడించాడు.

దర్శకుడి కాన్ఫిడెన్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ హీరోహీరోయిన్లపై సాంగ్ చిత్రీకరణ కోసం యూరోప్ బయలుదేరింది.