Waltair Veerayya: మాస్ ఇంట్రోను రెడీ చేస్తున్న వాల్తేరు వీరయ్య..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, చాలా రోజుల తరువాత చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్రకు సంబంధించిన ఇంట్రోను ఓ మాసివ్ టీజర్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Waltair Veerayya: మాస్ ఇంట్రోను రెడీ చేస్తున్న వాల్తేరు వీరయ్య..?

Waltair Veerayya To Give A Mass Treat Soon

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, చాలా రోజుల తరువాత చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగా, రీసెంట్‌గా బాస్ పార్టీ అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో ఆ సీన్స్ పీక్స్‌లో ఉంటాయట..!

అయితే ఇప్పుడు మరో మాస్ ట్రీట్ ఇచ్చేందుకు వాల్తేరు వీరయ్య టీమ్ రెడీ అవుతోందట. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా, ఆయన పాత్రకు సంబంధించిన ఇంట్రోను ఓ అదిరిపోయే టీజర్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట. అయితే, ఈ ఇంట్రో టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయాలని భావించినా, కొన్ని కారణాల వల్ల దాన్ని వచ్చే వారంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

Waltair Veerayya: బాస్ పార్టీ నుంచి మరో ట్రీట్ రానుందా..?

మాస్ రాజా ఎంట్రీ ఎలా ఉండబోతుందా అని రవితేజ ఫ్యాన్స్‌తో పాటు మెగాఫ్యాన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మరి ఈ సినిమాలో మాస్ రాజా ఇంట్రో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.