పైసలిచ్చే ప్రసక్తే లేదు

వినయ విధేయ రామ రూ.60 కోట్ల వరకూ షేర్ రాబట్టినా, బయ్యర్స్‌కి రూ.30 కోట్ల నష్టం అయితే తప్పలేదు.

  • Publish Date - February 8, 2019 / 06:32 AM IST

వినయ విధేయ రామ రూ.60 కోట్ల వరకూ షేర్ రాబట్టినా, బయ్యర్స్‌కి రూ.30 కోట్ల నష్టం అయితే తప్పలేదు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన వినయ విధేయ రామ థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వీవీఆర్‌తో, చరణ్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు బోయపాటి. రోటీన్ స్టోరీ, ఊరమాస్ యాక్షన్ సీన్లు, ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. దాదాపు రూ.60 కోట్ల వరకూ షేర్ రాబట్టినా, బయ్యర్స్‌కి రూ.30 కోట్ల నష్టం అయితే తప్పలేదు. ఈ విషయంలో బోయపాటికీ, దానయ్యకీ గొడవ జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు కాబట్టి, చరణ్ 5, దానయ్య 5, మొత్తం రూ.10 కోట్లు వాళ్ళకిద్దామని డిసైడ్ అయ్యి, దానయ్య, బోయపాటిని.. బయ్యర్స్‌కి నేను, చరణ్ కలిపి 10 కోట్లు ఇస్తున్నాం.

నీ పారితోషికంలో నుండి నువ్వు కూడా 5 కోట్లిస్తే, టోటల్ 15 కోట్లు వాళ్ళకిస్తాం. నష్టం సగమైనా తగ్గుతుంది కదా అనడిగితే, బోయపాటి ససేమిరా అన్నాడట. దిల్ రాజుని మధ్యవర్తిగా పెట్టి మాట్లాడించినా బోయపాటి పైసలిచ్చే ప్రసక్తే లేదని చెప్పాడట. దీంతో దానయ్య కోపం నషాలానికంటి, రెమ్యునరేషన్ కింద 15 కోట్లు తీసుకున్నావ్, భారీ బడ్జెట్ పెట్టించి, సరైన అవుట్ పుట్ ఇవ్వలేక పోయావ్.. మర్యాదగా డబ్బివ్వు అని గట్టిగా అడిగే సరికి.. 1 లేదా 2 కోట్లు సర్దుతా అని బోయపాటి చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని తెలుస్తుంది. బోయపాటి, దానయ్యల గొడవ గురించి ఫిలింనగర్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.