Jabardasth Faima : ఆస్పత్రిలో జబర్ధస్త్ ఫైమా.. చేతికి సెలైన్.. కంగారు పడుతున్న అభిమానులు..!
Jabardasth Faima in hospital : ఫైమా అంటే గుర్తు పట్టడం కష్టమే కానీ.. జబర్ధస్త్ ఫైమా అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు
- Thota Vamshi Kumar
- Published On : November 25, 2023 / 07:06 PM IST
Jabardasth Faima in hospital
ఫైమా అంటే గుర్తు పట్టడం కష్టమే కానీ.. జబర్ధస్త్ ఫైమా అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా గుర్తింపు తెచ్చుకున్న ఫైమాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటీజన్లు చాలా కంగారు పడుతున్నారు. ఈ వీడియోలో ఆమె ఆస్పత్రిలోని బెడ్ పై ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమెకు ఏమైందని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చింది ఫైమా. పటాస్ షోకు ఆడియెన్‌గా వెళ్లి కంటెస్టెంట్ అయ్యింది. తనదైన పంచ్‌లతో అందరిని నవ్వించింది. క్రమంగా ఆమె ప్రయాణం జబర్ధస్త్ వైపు అడుగులు వేసింది. ఇక జబర్ధస్త్‌లో అయితే తనదైన మేనరిజమ్, టైమింగ్‌తో పాటు డ్యాన్స్‌తోనూ అలరించింది. ఈ క్రమంలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో గత సీజన్‌లో బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది.
Bigg Boss 7 : కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్న నాగార్జున.. వాటి మూలంగానే మనం బలైపోతాం
దాదాపు 10 వారాల పాటు ఆమె హౌస్‌లో ఉంది. బీడీలు చుట్టగా వచ్చిన డబ్బుతో అమ్మ తమను పెంచి పోషించిందని ఆమె హౌస్‌లో ఉన్న సమయంలో చెప్పింది. అమ్మకు ఓ మంచి ఇల్లు కట్టిఇవ్వాలనేదే తన కోరిక అని పలు సందర్భాల్లో ఫైమా చెప్పుకొచ్చింది. కాగా.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె తన కోరికను నెరవేర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ఫైమా కొత్తింటి గృహ ప్రవేశ కార్యక్రమానికి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే సూర్య తదితరులు హజరయ్యారు.
ఇక పోతే.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫైమా ఓ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో ఆమె ఆస్పత్రిలో చేతికి సెలైన్‌తో కనిపించింది. నా గతమంతా నే మరిచానే అనే పాటను ఈ వీడియోకి జోడించింది. అయితే.. తనకు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. ఏం జరిగిందని నెటీజన్లు ప్రశ్నిస్తున్నారు. మీరు త్వరగా కోలుకోవాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరీ ఫైమా స్పందిస్తుందో లేదో.
Manchu Manoj : బ్రదర్స్ మధ్య గొడవలు గురించి మాట్లాడిన మంచు మనోజ్..
