Manchu Manoj : బ్రదర్స్ మధ్య గొడవలు గురించి మాట్లాడిన మంచు మనోజ్..

ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యిన మంచు మనోజ్ బ్రదర్స్ మధ్య గొడవలు గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Manchu Manoj : బ్రదర్స్ మధ్య గొడవలు గురించి మాట్లాడిన మంచు మనోజ్..

Manchu Manoj comments about ego between brothers gone viral

Manchu Manoj : మంచు బ్రదర్స్ మంచు విష్ణు, మనోజ్ మధ్య విబేధాలు వచ్చాయంటూ కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్, భూమా మౌనిక పెళ్ళిలో విష్ణు పెద్దగా కనిపించకపోవడం, ఆ తరువాత మంచు బ్రదర్స్ ఇద్దరు గొడవపడుతున్న ఒక వీడియో బయటకి రావడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ గొడవ గురించి మంచు కుటుంబసభ్యులు ఎవరూ కూడా పెద్దగా మాట్లాడడానికి ఆసక్తి చూపించలేదు.

ఇక అప్పటి నుంచి మంచు బ్రదర్స్ ఎక్కడా కలిసి కనిపించకపోవడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడడడం అనేవి కూడా జరగడం లేదు. తాజాగా ఒక వేదిక పై మనోజ్ మాట్లాడుతూ బ్రదర్స్ బాండింగ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సోదరా’ మూవీలోని సాంగ్ రిలీజ్ ఈవెంట్ కి మనోజ్ అతిథిగా వచ్చారు.

Also read : Tollywood : టాలీవుడ్‌లో సెట్ అవుతున్న కొత్త కాంబినేషన్స్.. చిరు, రవితేజ, డీజే టిల్లు..

ఈ ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ.. “సంపూర్ణేష్ బాబుని చూస్తే నాకు మా కజిన్ గుర్తుకు వస్తారు. ఆయన ప్రస్తుతం ఇప్పుడు లేరు. ఆయనలా స్వచ్ఛమైన నువ్వు, మనసు కలిగినవారే సంపూర్ణేష్ బాబు కూడా. అలాంటి వ్యక్తి బ్రదర్స్ అనే బాండింగ్ మీద ఒక సినిమా చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. బ్రదర్స్ మధ్య గొడవలు, ఇగోలు, డబ్బు సమస్యలు అనేవి ఉండకూడదు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సిస్టర్స్ మధ్య, ఫ్యామిలీ మధ్య కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి విబేధాలు ఉండవు” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మనోజ్ తన ఫ్యామిలీలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఈ కామెంట్స్ చేశారా అనే సందేహం కలిగిస్తుంది. కాగా 2018 నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మనోజ్.. మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే సినిమాలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.