Tollywood : టాలీవుడ్‌లో సెట్ అవుతున్న కొత్త కాంబినేషన్స్.. చిరు, రవితేజ, డీజే టిల్లు..

టాలీవుడ్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు హీరోలు దర్శకులు కూడా ఫ్రెష్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి, రవితేజ, సిద్దూజొన్నలగడ్డ..

Tollywood : టాలీవుడ్‌లో సెట్ అవుతున్న కొత్త కాంబినేషన్స్.. చిరు, రవితేజ, డీజే టిల్లు..

Tollywood star heroes new and upcoming movie updates

Tollywood : టాలీవుడ్ ఆడియన్స్ అభిరుచిలో వస్తున్న మార్పుతో హీరోలు దర్శకులు కూడా దానికి తగ్గట్టు సినిమాలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఫ్రెష్ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ పైన చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. తాజాగా మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్ తుది నిర్ణయం తీసుకోని సెట్స్ పైకి వెళ్లాలా లేదా అనే చర్చలు ఉన్నాయట. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, స్టార్ బాయ్ సిద్దూజొన్నలగడ్డ చర్చల్లో ఉన్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. శంకర్ దాదా ఎంబిబిఎస్ తరువాత చిరు నుంచి మళ్ళీ అలాంటి ఎంటర్టైనర్ రాలేదు. దీంతో చిరు అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా చిరు నుంచి అలాంటి ఒక కామెడీ ఎంటర్టైనర్ కోరుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఒక కాంబినేషన్ సెట్ కాబోతుందని తెలుస్తుంది. కామెడీతో పాటు కమర్షియాలిటీని కూడా చక్కగా చూపించే అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా ఆల్మోస్ట్ సెట్ అయ్యినట్లు సమాచారం. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నారట. మరి ఈ మూవీ పై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also read : Kantara 2 : కాంతార 2 బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్..

ఇక ‘జాతిరత్నాలు’ సినిమాతో ఆడియన్స్ ని బాగా నవ్వించిన అనుదీప్.. రవితేజతో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నారట. ‘ప్రిన్స్’ మూవీతో డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు.. హిట్టు కొట్టేందుకు ఒక మంచి కథని సిద్ధం చేశారట. ఆ స్టోరీని రవితేజకి చెప్పగా అటునుంచి కూడా గ్రీన్ సిగ్నెల్ వచ్చినట్లు సమాచారం. ఇక అనుదీప్ టేకింగ్ కి రవితేజ కామెడీ టైమింగ్ సెట్ అయితే థియేటర్ లో కడుపుబ్బా నవ్వుకోవడమే. మరి ఈ కాంబినేషన్ కూడా సెట్స్ పైకి వెళ్తుందా లేదా చూడాలి.

అలాగే మన డీజే టిల్లు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నారట. ఈ హీరో ప్రస్తుతం మరో మహిళా దర్శకురాలు నీరజ కోన డైరెక్షన్ లో ‘తెలుసు కదా’ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నందినీ రెడ్డి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని స్టార్ చేసిన సినిమా ఆగిపోయిందని, ఆ దర్శకుడితో మైత్రీ నిర్మాతలు ఇప్పుడు ఓ బాలీవుడ్ లేదా కోలీవుడ్ మూవీ సెట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ రెండు వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.