Peddi : అసలు రీజన్ స్పెషల్ సాంగ్ కాదు.. మరి వాయిదాకు కారణం ఏంటి?
ఒక్క స్పెషల్ సాంగ్ కారణంగానే పెద్ది సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. (Peddi)
- Saketh U
- Published on- April 20, 2026 / 09:26 PM IST
Peddi
Peddi : పెద్ది సినిమా విడుదల విషయంలో రెండోసారి కూడా మాట తప్పారు బుచ్చిబాబు. ఈ మంత్ ఎండింగ్‌కి బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన పెద్ది మూవీ ఏకంగా రెండు నెలలు వెనక్కి పోయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్‌లో అవుతున్నా ఒక్క స్పెషల్ సాంగ్ కారణంగానే పెద్ది సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
అయితే ఈ ఆలస్యానికి అసలు కారణం స్పెషల్ సాంగ్ కాదని VFX కారణంగానే పెద్ది ఈ సారి కూడా చెప్పిన డేట్‌కి రాకుండా వాయిదా పడినట్లు న్యూస్ వైరలవుతోంది. సోషల్ మీడియాలో పెద్ది సినిమా VFXకి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీకి VFX వర్క్ చేసిన ఫ్రేమ్ ఎక్స్ VFX కంపెనీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
Also Read : Aarav Bhatia : బాలీవుడ్ పిల్లలంతా ఒకవైపు.. ఈ హీరో కొడుకు ఒకవైపు.. జస్ట్ 4500 జీతానికి పని..
పెద్ది పహిల్వాన్‌గా రామ్ చరణ్‌పై కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే 4 నుంచి 5 నిమిషాల సన్నివేశాల్ని 3 నెలలు టైమ్ తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసినట్లు తెలిపింది. అంతేకాదు నిమిషానికి ఒక వెయ్యి 440 ఫ్రేమ్‌ల లెక్కన ప్రతి ఫ్రేమ్‌లో బెస్ట్ క్వాలిటీ అవుట్ ఫుట్ కోసం టీమ్ మొత్తం హార్డ్ వర్క్ చేసిందన్నారు.
అయితే పెద్ది సినిమాకి సంబంధించి వినిపిస్తోన్న ఈ VFX న్యూస్ మెగా అభిమానుల్ని మరింత వర్రీ అయ్యేలా చేస్తోంది. కేవలం 4 నుంచి 5 నిమిషాల సీన్స్ పూర్తికి 3 నెలలకి పైగా టైమ్ తీసుకుంటే.. సినిమాలో మిగిలిన సీజీ వర్క్ కంప్లీట్ చెయ్యడానికి ఇంకెంత టైమ్ పడుతుందోనని ఆలోచనలో పడ్డారు. అందుకే పెద్దిని జూన్‌కి వాయిదా వేసిన మేకర్స్ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని మాట్లాడుకుంటున్నారు. పెద్ది మూవీ మిగిలిన VFX పనులు కూడా ఇంతే టైమ్ తీసుకుంటే మాత్రం సినిమా విడుదల జూన్ కాదు కదా ఆగస్ట్‌కి కూడా వచ్చే అవకాశాలు కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంత లెట్ అయినా పెద్ది వస్తే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే అంటున్నారు.
Also Read : Eeshaa Rebba Birthday Celebrations : ఈషారెబ్బ బర్త్ డే.. కూచిపూడితో సెలబ్రేషన్స్.. ఫొటోలు..
