Vijay Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి కార్డు బాక్స్ లో ఏమేం ఉన్నాయో తెలుసా? అతిధులకు స్పెషల్ సర్‌ప్రైజ్ లు..
ఇంతకీ విజయ్ - రష్మిక పెళ్లి కార్డు బాక్స్ లో ఏమేం ఉన్నాయంటే.. (Vijay Rashmika)
- Saketh U
- Updated on- February 19, 2026 / 07:51 AM IST
Vijay Deverakonda Rashmika Mandanna
Vijay Rashmika : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి దగ్గరికొచ్చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో వీరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే జరగనుంది. ఆ తర్వాత మార్చ్ 4న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో భారీగా రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే విజయ్ ఇంటికి లైటింగ్ డెకరేషన్ కూడా పెట్టారు. పెళ్లి కార్డులు కూడా పంచుతున్నారు.(Vijay Rashmika)
విజయ్ – రష్మిక పెళ్లి కార్డు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరి పెళ్లి కార్డుని ఓ స్పెషల్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఈ బాక్స్ లో పెళ్లి కార్డుతో పాటు అతిధులను సర్ ప్రైజ్ చేసే స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి.
Also See : Sravanthi Chokarapu : బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ లెస్ ఫోజులతో.. వైరల్ అవుతున్న యాంకర్ స్రవంతి..
ఇంతకీ విజయ్ – రష్మిక పెళ్లి కార్డు బాక్స్ లో ఏమేం ఉన్నాయంటే..
రష్మిక కొన్ని నెలల క్రితం ఒక పెర్ఫ్యూమ్ కంపెనీ మొదలుపెట్టనుంది. ఆ కంపెనీకి చెందిన నేషనల్ క్రష్ అనే పెర్ఫ్యూమ్ బాటిల్ చిన్నది ఒకటి ఇచ్చారు.
అలాగే చేతులకు, కాళ్లకు రాసుకునే ఒక ఆయుర్వేదిక్ క్రీం ఒకటి ఇచ్చారు.
విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కి చెందిన టీ షర్ట్ ఒకటి బాక్స్ లో పెట్టారు.
అలాగే జీడిపప్పు ప్యాకెట్, ఒక స్వీట్ బాక్స్ కూడా అందులో ఉన్నాయి.
ఇలా విజయ్ – రష్మిక వెడ్డింగ్ కార్డు బాక్స్ లో ఈ స్పెషల్ ఫ్యాక్స్ ఉన్నాయి. వారి పెళ్లి కార్డు బాక్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ బాక్స్ కే బాగానే ఖర్చు అయి ఉంటుంది. ఇంక పెళ్లి రాజస్థాన్ లో, రిసెప్షన్ హైదరాబాద్ లో ఎంత గ్రాండ్ గా చేయబోతున్నారో అని అంతా ఎదురుచూస్తున్నారు. రిసెప్షన్ కి అయితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.
Also Read : Pawan Kalyan : అరుణాచలం గిరి ప్రదక్షణపై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?
