Bigg Boss OTT Telugu: ఓటీటీ తెలుగు సీజన్ మొదలయ్యేది ఎప్పుడంటే?
బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. ఆరవ సీజన్ కు ఇంకా ఐదారు నెలల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ మధ్యలోనే ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి.
- Naresh Mannam
- Published On : January 3, 2022 / 07:40 PM IST
Bigg Boss Telugu Ott
Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. ఆరవ సీజన్ కు ఇంకా ఐదారు నెలల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ మధ్యలోనే ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి. హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 15 సీజన్ జరుగుతుండగా ఓటీటీ తొలి సీజన్ కూడా పూర్తయింది. ఇక, ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ మొదలు కానుంది. ఇప్పటికే ఈ మేరకు నాగార్జున అధికారికంగా ప్రకటించగా దానికి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.
Alia Bhatt: ఫాఫమ్ అలియా.. పగలబడి నవ్వినా తప్పేనా?!
ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ ను ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ సంస్థ అయిన ‘ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్వహించనున్నట్లు తెలుస్తుండగా ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రముఖంగా యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.
Nidhhi Agerwal: దాచినా దాగని అందాల నిధి
వీరిలో కొందరి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోండగా అగ్రిమెంట్స్ కూడా పూర్తయినట్లుగా వినిపిస్తుంది. కాగా.. ఫిబ్రవరి 20 నుండి తొలి ఓటీటీ సీజన్ షో మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమన్నది షో నిర్వాహకుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఓటీటీ షో కోసం బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని మార్పుచేర్పులు చేసి మెరుగులు దిద్దుతున్నారట.
