EPIC : ఎపిక్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ ఎపిక్ (EPIC). ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
- Thota Vamshi Kumar
- Published on- September 11, 2026 / 09:44 AM IST
which OTT platform will epic movie be streaming
EPIC : ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ ఎపిక్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. వైష్ణవి చైతన్య కథానాయిక నటించిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించారు. నేడు (శుక్రవారం, సెప్టెంబర్ 11న) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.
ఇక ఈ చిత్రం ఏ ఓటీటీలోకి రానుంది అనే విషయం తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర టైటిల్ కార్డ్‌లో తెలియజేశారు. అయితే.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఇటీవల కాలంలో చాలా సినిమాలు విడులైన నాలుగు నుంచి ఆరు వారాల తరువాత ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఎపిక్ మూవీ సైతం నాలుగు నుంచి ఆరు వారాల తరువాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
