Ramba Oorvasi Menaka OTT : రంభ ఊర్వశి మేనక ఏ ఓటీటీలోకి వ‌స్తుందంటే?

అల్లరి నరేష్‌ నటించిన మూవీ రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka OTT) ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది అనే విషయం తెలిసి పోయింది

Which OTT platform will Rambha Urvashi Menaka be streaming on

Ramba Oorvasi Menaka OTT : అల్లరి నరేష్‌ నటించిన మూవీ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ క‌థానాయిక‌లుగా న‌టించారు.

వెన్నెల కిషోర్, నరేష్ వీకే కీలక పాత్ర‌ల‌ను పోషించ‌గా.. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా నేడు(సెప్టెంబ‌ర్ 4 శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టాక్ ఎలా ఉంది అన్న విష‌యాన్ని ప‌క్క‌న బెడితే.. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వ‌స్తుందో అన్న విష‌యం తెలిసిపోయింది.

Nandita Swetha : వింటేజ్ లుక్‌లో నందితా శ్వేత‌.. ఫోటోలు వైర‌ల్..

ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర టైటిల్ కార్డులోనే వెల్ల‌డించారు. అయితే.. ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది అన్న వివ‌రాలు తెలియ‌రాలేదు. కానీ.. ఈ చిత్రం విడుద‌లైన నాలుగు నుంచి ఆరు వారాల త‌రువాతే ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.