Toxic : ‘పెద్ది’లో జాన్వీ పాత్రని విమర్శించిన వాళ్ళు.. ఇప్పుడు టాక్సిక్ సినిమాని విమర్శిస్తారా?

పెద్ది సినిమాని టార్గెట్ చేసి నెగిటివిటి చేసిన సంగతి తెలిసిందే. (Toxic)

  • Updated on- August 26, 2026 / 04:06 PM IST

Toxic

Toxic : సినిమాలనేవి కల్పితం అని తెలిసినా, సినిమా మొదలయ్యేముందు ఇవన్నీ కల్పితాలు ఎవర్ని ఉద్దేశించినవి కాదు అని చెప్పినా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని పలు సినిమాలపై, అందులోని సీన్స్ పై విమర్శలు చేస్తారు. ఇటీవల పెద్ది సినిమాపై పలువురు బాలీవుడ్ జనాలు, సూడో ఫెమినిస్ట్ లు, మన టాలీవుడ్ సోషల్ మీడియా మేధావులు కూడా ఇలాగే విమర్శలు చేసారు.

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత బాగా చేసింది. అసలు అలాంటి పాత్ర రాయడం ఎందుకు, మహిళలు అంటే అంగాంగ ప్రదర్శన మాత్రమేనా? మహిళలను కించపరిచారు, జాన్వీ సీన్స్ తీసేయాలి, ఆ పాత్రకు అంత అందాల ఆరబోత అవసర్లేదు.. అంటూ పలువురు సినిమాపై, సినిమా దర్శకుడిపై విమర్శలు చేసారు. పాపం అక్కర్లేకపోయినా దర్శకుడు బుచ్చిబాబు దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ లో అంత కంటే ఎక్కువే హీరోయిన్స్ అందాల ఆరబోత జరుగుతుంది. అయినా పెద్ది సినిమాని టార్గెట్ చేసి నెగిటివిటి చేసిన సంగతి తెలిసిందే.

Also See : Samantha : ప్రగ్నెన్సీ బేబీ బంప్‌తో భారీ ఎక్సర్ సైజ్‌లు చేస్తున్న సమంత.. ఫొటోలు వైరల్..

నేడు యశ్ టాక్సిక్ సినిమా రిలీజయింది. ఈ సినిమా గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్ నుంచే అడల్ట్ సినిమా అని, శృంగార సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సినిమాలో కథకి అవసరం లేకపోయినా శృంగార సన్నివేశాలు, సీన్స్ కి అవసరం లేకపోయినా హీరోయిన్స్ అందాల ఆరబోతలు, డబల్ మీనింగ్ మాటలు, డబల్ మీనింగ్ చేతలు, అక్కర్లేకపోయినా మహిళలతో ఓ యాక్షన్ సీక్వెన్స్, చాలా సీన్స్ లో అర్ధనగ్నంగా పలువురు అమ్మాయిలు, హీరో అమ్మాయిలతో శృంగారం చేయడం.. ఇలాంటి సన్నివేశాలే సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. అసలు హీరో ఎంట్రీ సీన్ లో ఆ శృంగార సన్నివేశం అవసరమే లేదు. మరి ఎందుకు పెట్టారో దర్శకురాలి, యశ్ కే తెలియాలి. ఈ సన్నివేశాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారేమో చూడాలి.

కథకు అవసరం లేకపోయినా ఈ సీన్స్ పెట్టారు. హీరోయిన్స్ తో రొమాన్స్ చేయించారు. పైగా ఈ సినిమా తీసింది మహిళా దర్శకురాలు. మరి పెద్ది సినిమాని విమర్శించిన వాళ్ళు ఈ సినిమాని, సినిమాలోని సన్నివేశాలను విమర్శిస్తారా? ఈ సినిమాలో మహిళల అంగాంగ ప్రదర్శన ఎవరికీ ఇబ్బంది కలగలేదా? హీరోయిన్స్ కేవలం శృంగారం కోసమేనా అనే ప్రశ్న ఎవరికీ రాలేదా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి టాక్సిక్ సినిమాలోని అడల్ట్ సీన్స్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తారేమో చూడాలి.

Also See : Nabha Natesh : ఓనం స్పెషల్.. చీరకట్టులో భారీ ఆభరణాలతో నభా నటేష్..