మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ విలక్షణమైన పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ అందర్నీ మెప్పిస్తున్నారు. ‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఇప్పుడు త్రిభాషా చిత్రంలో నటిస్తుండడం విశేషం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథను సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఓ యువకుడు, యువతి చేయి పట్టుకుని ఉన్నాడు.