Bhootham Praytham : యాదమ్మ రాజు, ఇమ్మాన్యుయేల్ హీరోలుగా.. హారర్ కామెడీ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ రిలీజ్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Bhootham Praytham)

  • Published on- November 16, 2026 / 02:53 PM IST

Bhootham Praytham

Bhootham Praytham : యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమాన్యుయేల్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా భూతం ప్రేతం. సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి.వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధృవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ రిలీజ్ చేయగా తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ భూతం ప్రేతం సినిమా డిసెంబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు కావాల్సిన హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతోంది. త్వరలో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

Also Read : Saketh Komanduri : చెల్లి నిశ్చితార్థ వేడుకలో సందడి చేసిన సింగర్ సాకేత్.. ఫొటోలు..

టీవీ షో లలో తమ కామెడీతో మెప్పిస్తున్న యాదమ్మ రాజు, ఇమ్మాన్యుయేల్ హీరోలుగా ఎలా మెప్పిస్తారో చూడాలి.