Yami Gautam : కామెడీ ట్రాక్ లోకి వచ్చిన యామీ గౌతమ్.. దసరాకి..
బాలాజీ మోహన్ దర్శకత్వంలో యామి గౌతమ్ మెయిన్ లీడ్ గా 'నయ్యి నవెల్లి' అనే ఓ కొత్త సినిమాని ప్రకటించారు. (Yami Gautam)
- Saketh U
- Updated on- August 20, 2026 / 07:05 AM IST
Yami Gautam
Yami Gautam : బాలీవుడ్ లో సీరియస్ పత్రాలు ఎక్కువగా అచేసే హీరోయిన్ యామీ గౌతమ్ ఇప్పుడు కామెడీ ట్రాక్ లోకి వచ్చింది. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో బ్యానర్స్ పై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాణంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో యామి గౌతమ్ మెయిన్ లీడ్ గా ‘నయ్యి నవెల్లి’ అనే ఓ కొత్త సినిమాని ప్రకటించారు.
బాలీవుడ్ నిర్మాతలతో తమిళ దర్శకుడితో ఈ సినిమా తమిళంలో తెరకెక్కి మిగతా భాషలలో డబ్బింగ్ అవ్వనుంది. ఈ సినిమాకు హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథను అందించగా, జి.వి. ప్రకాష్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా 16 అక్టోబర్ 2026న దసరాకు రిలీజ్ కానుంది.
ఈ నయ్యి నవెల్లి.. మీరట్ నగరంలోని ఒక చలాకి కుటుంబంలోకి పెళ్లై కొత్తగా కోడలు రాగా ఆమె రాకతో ఆ ఇల్లు సాఫీగా సాగుతున్నా చాలా పర్ఫెక్ట్ గా, ఆదర్శంగా కనిపిస్తున్న తన వదిన నిజానికి ఒక మాంత్రికురాలు ఏమో అని ఆమె మరిదికి అనుమానం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి వింతలు జరిగాయి? ఎంతటి నవ్వుల హంగామా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ మాట్లాడుతూ.. నయ్యి నవెల్లి ప్రతి మలుపులో ఆశ్చర్యపరుస్తుంది. కామెడీ, ఫాంటసీ, అడ్వెంచర్ కథలో యామీ గౌతమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అమెజాన్ MGM స్టూడియోస్‌తో మొదటిసారి కలిసి పనిచేస్తున్నాం అని తెలిపారు. అమెజాన్ MGM స్టూడియోస్ ప్రతినిధి నిఖిల్ మధోక్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక ఇది కచ్చితంగా దసరా పండుగకు రిలీజ్ చేయాల్సిన సినిమా అని అప్పుడే రిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
