Yami Gautam : భర్త కూడా అలా ఉంటే.. పెళ్లి హీరోయిన్స్ కెరీర్‌కి అడ్డం కాదు.. బాలీవుడ్ భామ వ్యాఖ్యలు..

యామి గౌతమ్ మాట్లాడుతూ.. ''పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసింది అనుకుంటే పొరపాటే. పెళ్లి హీరోయిన్స్ కెరీర్ కి అడ్డం కాదు, కాకూడదు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా

Yami Gautam comments on heroins career after marriage

Yami Gautam :  ఫెయిర్ అండ్ లవ్లీ భామగా ఫేమస్ అయిన యామి గౌతమ్ టాలీవుడ్, పంజాబీ సినిమాల్లో కెరీర్ ని మొదలుపెట్టి అనంతరం బాలీవుడ్ కి చెక్కేసి అక్కడే సెటిల్ అయిపొయింది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు చేసిన యాని గౌతమ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది.

2021లో రచయిత, దర్శకుడు అయిన ఆదిత్య ధర్ ని పెళ్లి చేసుకుంది యామి గౌతమ్. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ మెప్పిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ గురించి వ్యాఖ్యలు చేసింది యామి.

Rajamouli : కాంతార సినిమా వల్ల మేం ఆలోచించాల్సి వస్తుంది..

యామి గౌతమ్ మాట్లాడుతూ.. ”పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసింది అనుకుంటే పొరపాటే. పెళ్లి హీరోయిన్స్ కెరీర్ కి అడ్డం కాదు, కాకూడదు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా నటిస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత ఒక మహిళగా బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతల్ని కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తూ కెరీర్ ని చూసుకోవాలి. భర్త ప్రోత్సాహం ఉంటే మరింత ఉత్సాహంగా చేయొచ్చు. నా భర్త కూడా ఇదే ఫీల్డ్, కాబట్టి నా వర్క్ గురించి తెలిసి నాకు సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే నేను సినిమాలు చేస్తున్నాను” అని తెలిపింది.