Yami Gautam : హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. జాగ్రత్త అంటూ ట్విట్టర్లో పోస్ట్
తాజాగా యామి గౌతమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడంతో తొందరగానే గుర్తించి ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ట్విట్టర్లో యామి.. ''నేను నిన్నటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను..........
- Saketh U
- Published on- April 4, 2022 / 10:06 AM IST
Yami
Yami Gautam : ఇటీవల చాలా మంది సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం చూశాం. ఇలా సెలబ్రిటీల అకౌంట్స్ ని హ్యాక్ చేసి డబ్బులు అడగడమో లేక ఏవేవో పిచ్చి పోస్టులు పెట్టడమో, తప్పుడు సమాచారం ప్రచారం చేయడమో చేస్తూ ఉంటారు హ్యాకర్స్. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ఇది సాధారణ విషయం అయిపొయింది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. తెలుగులో ‘నువ్విలా’తో పాటు మరో రెండు మూడు సినిమాలు చేసిన యామి గౌతమ్ హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో బిజీ అయిపొయింది.
Priyanka Jawalkar : విజయ్ దేవరకొండ హీరోయిన్‌కి, ఆ యువ క్రికెటర్‌కి మధ్య ఏముంది?
తాజాగా యామి గౌతమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడంతో తొందరగానే గుర్తించి ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ట్విట్టర్లో యామి.. ”నేను నిన్నటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా అది హ్యాక్ అయి ఉండవచ్చునని అనుకుంటున్నాను. అందుకే మీ అందరికీ తెలియచేస్తున్నాను. వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోపు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఏదైనా అసాధారణ కార్యకలాపాలు ఉంటే దాని గురించి తెలుసుకొని దయచేసి జాగ్రత్తగా ఉండండి” అంటూ పోస్ట్ చేసింది.
