Tabaahi Song : బాబోయ్.. టాక్సిక్ నుంచి బోల్డ్ సాంగ్ రిలీజ్.. యశ్, కియారా అద్వానీ రొమాన్స్ పీక్స్..
మీరు కూడా యశ్, కియారా అద్వానీ రొమాంటిక్ తబాయి సాంగ్ చూసేయండి..(Tabaahi Song)
- Saketh U
- Published on- July 8, 2026 / 11:49 AM IST
Tabaahi Song
Tabaahi Song : కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న యశ్ నెక్స్ట్ సినిమా టాక్సిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినా ఆగస్టు 26 రిలీజ్ కానుందని ఇటీవల ప్రకటించారు.
ఇప్పటికే యశ్ టాక్సిక్ సినిమా నుంచి పలు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అన్ని కూడా బోల్డ్ గానే ఉన్నాయి. రొమాన్స్, వైలెన్స్ తోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి తబాయి.. అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో యశ్, కియారా అద్వానీ ఫుల్ రొమ్సన్ తో రెచ్చిపోయారు. కన్నడతో పాటు, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ పాటని రిలీజ్ చేశారు.
మీరు కూడా యశ్, కియారా అద్వానీ రొమాంటిక్ తబాయి సాంగ్ చూసేయండి..
