Yash : యశ్ నెక్స్ట్ సినిమా ఆమె దర్శకత్వంలో? ఈసారి లవ్ స్టోరీతో..

యశ్ నెక్స్ట్ మూవీ విషయంలో చాలామంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. స్టార్ డైరెక్టర్స్ చాలా మంది యశ్ తో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపించారు. ‘కేజీఎఫ్ 3’ కూడా వ‌స్తుంద‌ని ప్రచారం జ‌రిగింది.

  • Published On : June 21, 2023 / 10:12 AM IST

Yash next movie in malayalam director Geetu Mohan das direction rumors goes viral

Geetu Mohandas :  అంతకు ముందు కన్నడలో ఎన్ని సినిమాలు చేశాడో? ఎంత క్రేజ్ సంపాదించాడో కర్ణాటక బయట ఎవరికీ అంతగా తెలియకపోయినా కేజీఎఫ్ సిరీస్ లోని రెండు సినిమాల సూపర్ సక్సెస్ తో గ్లోబల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాక్ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలు అతడి కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచాయి. 1000 కోట్లకు పైగా కేజీఎఫ్ కలెక్షన్స్ సాధించి కన్నడ సినీ పరిశ్రమ రేంజ్ ని మార్చింది. ఇక ఆ సినిమా తర్వాత యశ్ నెక్స్ట్ మూవీపై ఇంత వరకూ ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా అసహనంగా ఉన్నారు.

యశ్ నెక్స్ట్ మూవీ విషయంలో చాలామంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. స్టార్ డైరెక్టర్స్ చాలా మంది యశ్ తో సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపించారు. ‘కేజీఎఫ్ 3’ కూడా వ‌స్తుంద‌ని ప్రచారం జ‌రిగింది. కానీ ఇప్పటివరకు దీనిపై సరైన క్లారిటీ లేదు. యశ్ నెక్స్ట్ సినిమాపై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. తాజాగా యశ్ నెక్స్ట్ సినిమాపై ఓ కొత్త టాక్ నడుస్తోంది.

యశ్ ఓ లేడీ డైరెక్టర్ కి అవకాశమిచ్చాడని సమాచారం. గీతూ మోహన్ దాస్ అనే ఓ మలయాళ డైరెక్టర్ కి యశ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. గీతూ మోహన్ దాస్ నటిగా మలయాళంలో పలు సినిమాల్లో నటించి అనంతరం దర్శకురాలిగా మారి మూడు సినిమాలు చేసింది. నివీన్ పాలీతో ‘మూత్తోన్’ అనే అవార్డ్ ఫిల్మ్ తీసి మంచి విజయం సాధించింది. ఈ డైరెక్టర్ యశ్ కు ఒక మంచి రొమాంటిక్ స్టోరీ నెరేట్ చేసిందని, అది యశ్ కు బాగా నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

Sriya Reddy : పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, OG సినిమాపై కామెంట్స్ చేసిన శ్రియ రెడ్డి.. ఆయన సీఎం అయితే..

త్వరలోనే ఈ సినిమాని అఫీషియల్ గా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. కేజీఎఫ్ తర్వాత యశ్ దానికి మించిన యాక్షన్ మూవీని చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాత్రం యశ్ కి చెప్పిన రొమాంటిక్ లవ్ స్టోరీకి ఓకే చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కేజీఎఫ్ తో యాక్షన్ లో రాఖీ భాయ్ ని చూసి ఇప్పుడు లవర్ బాయ్ గా చూస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.