×
Ad

Toxic Release Postponed: యష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. టాక్సిక్ సినిమా వాయిదా.. కొత్త డేట్ ఇదే

కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న టాక్సిక్(Toxic) సినిమా వాయిదా పడింది.

yash Toxic movie postponed

  • యష్ టాక్సిక్ సినిమా వాయిదా
  • మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం కారణంగానే వాయిదా
  • అధికారిక ప్రకటన చేసిన నిర్మాణ సంస్థ

Toxic: కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ టాక్సిక్ సినిమా వాయిదా పడింది. ఈమేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం టాక్సిక్ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. కానీ, మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఆకారణంగా ఈ సినిమాను జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కేవీఎన్ సంస్థ అధికారిక నోట్ విడుదల చేసింది. దీంతో, యష్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

Srinath Maganti: ENE 2లో చేస్తున్నా అంటే భూతులు తిట్టారు.. అది నేను లాక్కోలేదు.. కష్టపడి సంపాదించుకున్నా

ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాను కన్నడ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత కన్నడ స్టార్ యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్(Toxic) సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కంటెంట్, టీజర్, పోస్టర్స్ కూడా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ టాక్సిక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈ నేపథ్యంలోనే టాక్సిక్ సినిమా కోసం యష్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూశారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా ఇప్పుడు వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. మరి జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న టాక్సిక్ సినిమా ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.