మనసుని హత్తుకునే పాట

యాత్ర లిరికల్ సాంగ్ రిలీజ్

  • Publish Date - January 26, 2019 / 05:44 AM IST

యాత్ర లిరికల్ సాంగ్ రిలీజ్

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా, యాత్ర. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన యాత్ర స్టిల్స్‌కీ, టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కీ మంచి రెస్పాన్స్ వస్తుంది.  
 రీసెంట్‌గా యాత్ర నుండి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. పల్లెళ్ళో కళ ఉంది, పంటల్లో కలిముంది, అనిచెప్పే మాటల్లో విలువేముంది? కళ్లల్లో నీరుంది, ఒళ్ళంతా చెమటుంది, ఆ చెమ్మకి చిగురించే పొలమేముంది? చినుకివ్వని మబ్బుంది, మొలకివ్వని మన్నుంది, కరుణించని కరువుంది, ఇంకేముందీ? రైతేగా రాజంటూ అనగానే ఏమైంది, అది ఏదో నిందల్లే వినబడుతుంది.. అంటూ సాగే పాట హార్ట్ టచింగ్‌గా ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆవేదన అంతా ఈ పాటలో కనిపిస్తుంది, వినిపిస్తుంది..

సినీ పాటల పూదోటలో తన పాటలతో ఎన్నో సాహిత్య కుసుమాలు పూయించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటని అద్భుతంగా రాయగా, గాన గంధర్వుడు ఎస్‌పి బాలు అంతే అద్భుతంగా పాడారు. ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, వై.ఎస్.ఆర్ తండ్రి రాజారెడ్డిగా కనిపించనున్నారు.  ఫిబ్రవరి 8న యాత్ర గ్రాండ్‌గారిలీజ్ కానుంది. సంగీతం : కె (కృష్ణ కుమార్), కెమెరా : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : మహి వి.రాఘవ్.
 

వాచ్ సాంగ్…