అమెరికాలో యాత్ర హంగామా

అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వై.ఎస్‌.ఆర్. అభిమానులు యాత్ర ప్రీ-‌రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తున్నారు.

  • Publish Date - January 31, 2019 / 09:19 AM IST

అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వై.ఎస్‌.ఆర్. అభిమానులు యాత్ర ప్రీ-‌రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తున్నారు.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా రూపొందుతున్న సినిమా, యాత్ర. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన యాత్ర స్టిల్స్‌కీ, ట్రైలర్ అండ్ సాంగ్స్‌కీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌, మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో యాత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మరోవైపు అమెరికాలోనూ యాత్ర ప్రీ-రిలీజ్ హంగామా మొదలయిపోయింది. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వై.ఎస్‌.ఆర్. అభిమానులు, తెలుగు ప్రజలంతా ఒకచోట చేరి, ఒకొక్క ప్లేస్‌లో, ఒక్కోరోజు యాత్ర ప్రీ-‌రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తున్నారు.

వై.ఎస్‌.ఆర్‌.లా పంచె కట్టుతో, భారీ ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు అమెరికాలో ఉన్న అభిమానులు.. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం భాషల్లోనూ యాత్ర రిలీజవనుంది. ఫిబ్రవరి 7న యూఎస్‌లో భారీగా ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, వై.ఎస్.ఆర్ తండ్రి రాజారెడ్డిగా కనిపించనున్నారు. సంగీతం : కె (కృష్ణ కుమార్), కెమెరా : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : మహి వి.రాఘవ్.

వాచ్ ట్రైలర్…