యాత్ర సాంగ్స్ విన్నారా?

ఆకట్టుకుంటున్న యాత్ర పాటలు.

  • Publish Date - February 2, 2019 / 06:43 AM IST

ఆకట్టుకుంటున్న యాత్ర పాటలు.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా, మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, యాత్ర. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన యాత్ర స్టిల్స్‌కీ, ట్రైలర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌, మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో యాత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తున్న యాత్ర మూవీ ఆడియో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కె (కృష్ణకుమార్) ఈ సినిమాకి సంగీతమందించాడు.  కాలభైరవ పాడిన సమరశంఖం పాటతో మొదలయ్యే యాత్ర ఆల్బమ్‌లో మొత్తం ఆరు పాటలున్నాయి.

అయిదు పాటలను సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతంగా రాయగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, శంకర్ మహదేవన్, సాయి చరణ్ చాలా బాగా పాడారు. మరుగైనావా రాజన్నా పాటను పెంచల్ దాస్ రాయడమే కాక, మనసును హత్తుకునేలా పాడాడు. పాటలన్నీ కూడా సినిమాకి తగ్గట్టుగా, వినసొంపుగా ఉన్నాయి. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం భాషల్లోనూ యాత్ర రూపొందుతుంది. ఫిబ్రవరి 7న యూఎస్‌లో భారీగా ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఫిబ్రవరి 8న యాత్ర గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. జగపతి బాబు, సుధీర్ బాబు, నాగినీడు, సచిన్ కేద్‌కర్ తదితరులు నటించిన 
ఈ సినిమాకి కెమెరా : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : మహి వి.రాఘవ్.

వాచ్ సాంగ్స్…