Harsha Sai : డబ్బుల కోసం ఆరోపణలు చేస్తున్నారు.. నా లాయర్ మాట్లాడతారు.. హర్ష సాయి పోస్ట్..

తాజాగా ఆరోపణలపై హర్ష సాయి స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు.

You Tuber Harsha Sai Reacts about Allegations on Him

Harsha Sai : నిన్న ఓ నటి హర్ష సాయి తనని మోసం చేసాడని, తనపై అఘాయిత్యం చేసి వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ లో పాపులర్ అయిన హర్ష సాయిపై ఇలా ఆరోపణలు రావడంతో సంచలనంగా మారింది.

Also Read : Harsha sai : సినిమా రైట్స్ ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతాను అని బ్లాక్ మెయిల్.. హర్ష సాయి లీలలు..

తాజాగా దీనిపై హర్ష సాయి స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. హర్ష సాయి.. నా పై చేసిన కామెంట్స్ అన్ని అబద్దాలే. అదనపు డబ్బులు కోసం చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ. నా గురించి మీకు తెలుసు, నిజాలు అన్ని త్వరలో బయటకు వస్తాయి. అన్ని విషయాలు మా లాయర్ తానికొండ చిరంజీవి మాట్లాడతారు అని పోస్ట్ చేసాడు.