నా ఇంట్లో ఐటీ వాళ్లు దాడి చేసుంటే.. : యంగ్ హీరో ఫన్నీ ట్వీట్
- vamsi
- Published on- November 21, 2019 / 06:31 AM IST
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో తన ఫన్నీ యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్న ఈ కుర్ర హీరో చేతిలో ప్రస్తుతం హీరోగా మాత్రం పెద్దగా సినిమాలు లేవు. అప్పుడప్పుడు సైడ్ యాక్టర్‌గా కొన్ని సినిమాల్లో చేస్తున్నారు. ప్రస్తుతం అల.. వైకుంఠపురములో సినిమాలో మాత్రం కీలక పాత్రలో చేస్తున్నాడు
అయితే అప్పుడప్పుడు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అలరించే ట్వీట్లు చేస్తుండే నవదీప్ లేటెస్ట్గా ఐటీ అధికారులను ఉద్ధేశిస్తూ తనదైన శైలిలో ఫన్నీగా ట్వీట్ చేశాడు. టాలీవుడ్ నిర్మాతలు, హీరోలపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు జరిపిన క్రమంలో ఐటీ దాడులపై నవ్వించేలా ట్వీట్ చేశారు.
ఇన్‌కంట్యాక్స్ అధికారులు నా మీద దాడి చేసి ఉంటే, వాళ్లే కొంత మనీని నా దగ్గర వదిలేసి వెళ్ళేవారు అంటూ సరదాగా కామెంట్ పెట్టారు. దీంతో పాటు బిల్ బ్యాండ్ బాజా అనే హ్యాష్ ట్యాగ్ కూడా తన కామెంట్‌కి జతచేశాడు నవదీప్.
ఇక నిర్మాత సురేష్ బాబు, హీరోలు వెంకటేష్, నానీ ఇల్లు, ఆఫీసులలో ఐటీ దాడులు జరగడంతో టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు కంగారు పడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపైనే యంగ్ హీరో నవదీప్ దీనిపై ఫన్నీగా ట్వీట్ చేశారు.
