Youtuber Komali: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న కోమలి.
- V Santhosh Kumar
- Published On : February 25, 2026 / 09:26 AM IST
YouTuber Komal committed suicide
- ఆత్మహత్య చేసుకున్న యూట్యూబర్ కోమలి
- ప్రేమవ్యవహారమే కారణం అంటూ సమాచారం
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Youtuber Komali: ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతున్న కోమలి.. యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Rashi Singh: ఎర్ర చీరలో హాట్ అందాలు.. రాశి సింగ్ క్రేజీ ఫొటోలు
అయితే, కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది. కోమలి(Youtuber Komali) గత మూడేళ్లుగా మరో యుట్యూబర్‌తో ప్రేమలో ఉంది. అతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. యూట్యూబర్‌లో వీడియోలు చేస్తున్నాడు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ కారణంగా కొన్ని నెలల క్రితమే ఆత్మహత్యకి యత్నించింది కోమలి. ఇప్పుడు మరోసారి సూసైడ్ చేసుకుంది కోమలి. ఇక కోమలి ఆత్మహత్య ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
